Murder: మైనర్ బాలుడి దారుణ హత్య-కాళ్లు చేతులు కోసి సంచిలో మూటగట్టి..

Minor boy brutally murdered: ఏ విషయంలో గొడవపడ్డారో తెలియదు కానీ అవినాష్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. కత్తితో అతన్ని పొడిచి చంపాడు. అక్కడితో ఆగక... అతని గొంతును కత్తితో చీల్చి... కాళ్లు, చేతులు కోసేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 01:56 PM IST
  • జార్ఖండ్‌లో బాలుడి దారుణ హత్య
  • కత్తితో పొడిచి చంపిన బాలుడి స్నేహితుడు
  • కాళ్లు, చేతులు కత్తితో కోసి సంచిలో మూటగట్టాడు
  • ఆ మూటను అడవిలో పారేసి వెళ్లిపోయాడు
Murder: మైనర్ బాలుడి దారుణ హత్య-కాళ్లు చేతులు కోసి సంచిలో మూటగట్టి..

Minor boy brutally murdered: జార్ఖండ్‌లో (Jharkhand) దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడిని 19 ఏళ్ల అతని స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. కత్తితో బాలుడిని పొడిచి చంపి... ఆపై అతని కాళ్లు, చేతులు కోసేశాడు. మృతుడి అవయవాలను సంచిలో కుక్కి అడవిలో పారేశాడు. డియోఘర్ జిల్లాలోని రోహిణి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రోహిణి గ్రామానికి చెందిన ఓ బాలుడు (14), అతని స్నేహితుడైన మరో బాలుడు (14)తో కలిసి మంగళవారం (డిసెంబర్ 21) రాత్రి కుమ్రాబాద్ స్టేషన్ రోడ్డు వైపు వెళ్లాడు. మార్గమధ్యలో అవినాష్ (19) అనే మరో స్నేహితుడు వారితో చేరాడు. ముగ్గురు కలిసి కుమ్రాబాద్ నుంచి పలంగ పహద్ అడవి వైపు నడుచుకుంటూ వెళ్లారు.

ఆ సమయంలో అవినాష్‌కు, రోహిణి గ్రామానికి చెందిన బాలుడికి మధ్య గొడవ జరిగింది. ఏ విషయంలో గొడవపడ్డారో తెలియదు కానీ అవినాష్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయి బాలుడిపై దాడి చేశాడు. కత్తితో అతన్ని పొడిచి చంపాడు. అక్కడితో ఆగక... అతని గొంతును కత్తితో చీల్చి... కాళ్లు, చేతులు కోసేశాడు. ఆపై సంచిలో అతని అవయవాలు మూటగట్టి అడవిలో పారేశాడు.

అవినాష్, బాధిత బాలుడితో పాటు వెళ్లిన మరో బాలుడిని పోలీసులు విచారించగా ఈ వివరాలు బయటపెట్టాడు. దీంతో పోలీసులు నిందితుడు అవినాష్‌ను అరెస్ట్ చేయగా.. అతను నేరం అంగీకరించాడు. అయితే బాలుడిని చంపడానికి (Murder case) గల కారణాలేంటన్నది బయటకు వెల్లడి కాలేదు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య), 120B(నేరపూరిత కుట్ర)తో పాటు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: AP Movie Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News