carona virus effect in india: 'కరోనా'ను కాల్చేద్దాం..!!

 'కరోనా వైరస్'..  గుబులు పుట్టిస్తోంది. ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చైనాలో కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ. . మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 4 వేలకు దగ్గరలో ఉండడంతో అంతా భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు.

Last Updated : Mar 9, 2020, 02:38 PM IST
carona virus effect in india: 'కరోనా'ను కాల్చేద్దాం..!!

 'కరోనా వైరస్'..  గుబులు పుట్టిస్తోంది. ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చైనాలో కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ. . మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మృతుల సంఖ్య దాదాపు 4 వేలకు దగ్గరలో ఉండడంతో అంతా భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 

మరోవైపు భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కు చేరింది. ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఇతర దేశాల నుంచి కరోనా వైరస్ రాకుండా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించవచ్చు. ఈ కారణంగా.. వైరస్ వ్యాప్తి మరింత సులువయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా సరిహద్దుల్లోని ఆయా చెక్ పోస్టుల దగ్గర కట్టుదిట్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. 

మరోవైపు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కుర్చీలు, కౌంటర్లపై స్ప్రే చల్లుతున్నారు.  

మరోవైపు ముంబైలో హోలీ ఘనంగా జరుగుతోంది. హోలీ సందర్భంగా కామ దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. నిజానికి కామ దహనం సందర్భంగా భారీ కట్టెలు, పిడకలు దహనం చేస్తారు. కానీ ఈసారి ముంబైకర్లు కొత్తగా ఆలోచించారు. కరోనా వైరస్ ను దహనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కరోనా అసుర అనే పేద్ద రాక్షసి దిష్టి బొమ్మను తయారు చేశారు. హోలీ సందర్భంగా ఇవాళ దాన్ని దహనం చేయనున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News