10 తరగతి కుర్రాడు రూ.47 లక్షలు చోరీ చేసి.. ఫ్రెండ్ ఫిష్ డే పార్టీ ఇచ్చాడు..!

మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన స్నేహితులకు 'ఫ్రెండ్ షిప్ డే' సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకున్నాడు. 

Last Updated : Aug 13, 2018, 07:39 PM IST
10 తరగతి కుర్రాడు రూ.47 లక్షలు చోరీ చేసి.. ఫ్రెండ్ ఫిష్ డే పార్టీ ఇచ్చాడు..!

మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన స్నేహితులకు 'ఫ్రెండ్ షిప్ డే' సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ఇంట్లో తన తండ్రి కళ్లు కప్పి రూ.47 లక్షలు చోరీ చేశాడు. కానీ తను అంతటితోటే ఆగలేదు. తన స్నేహితులకు పెద్ద మొత్తంలో డబ్బు కూడా పంచాడు. తన హోంవర్క్ రోజూ రాసే స్నేహితుడికి రూ.3 లక్షలు.. అలాగే తన బెస్ట్ ఫ్రెండ్‌కి రూ.15 లక్షలు ఇచ్చాడు. అయితే డబ్బుతో పాటు తన కొడుకు కూడా కనిపించకపోవడంతో ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి తండ్రి జబల్ పూర్ ప్రాంతంలో పెద్ద బిల్డర్. దాదాపు రూ.60 లక్షల రూపాయలు బ్యాంకు నుండి డ్రా చేసి తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో దాచాడు.

ఆ తర్వాత  బీరువా తెరిచి చూడగా.. అందులో డబ్బు కనిపించకపోవడంతో హతాశుడయ్యాడు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేయగా.. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేసి ఆఖరికి బిల్డర్ కొడుకే డబ్బు దొంగలించాడని తేల్చారు. తొలుత బాలుడి స్నేహితుడి వివరాలు సేకరించిన పోలీసులు వారి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

ఆ నిఘాలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆ బాలుడి స్నేహితులు రూ.15 లక్షల రూపాయలతో ఓ కారు కూడా కొన్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలో బాలుడి స్నేహితుల ఇంటికి వెళ్లి కూడా ఎంక్వయరీ చేశారు. వారి తల్లిదండ్రులకు కూడా జరిగిన విషయాలు తెలిపారు. వెంటనే వారి పిల్లల జాడ తెలుసుకొని.. వారి నుండి డబ్బు తీసుకొని స్టేషనులో అప్పగించాలని.. లెక్కపోతే చట్టరీత్య చర్య తీసుకోవాల్సి ఉంటుందని వారి తల్లిదండ్రులకు కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆ బాలుడితో పాటు వారి స్నేహితుల జాడ తెలుసుకొనేందుకు ఒక బృందాన్ని మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పంపించామని ఎస్సై బీఎస్ తోమర్ మీడియాకి తెలిపారు. 

Trending News