సోషల్ మీడియాలో ఖాతా ఉంటేనే.. పార్టీ టికెట్

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టికెట్ ఆశిస్తున్న వారికి కొత్త షరతులు విధించింది మధ్య ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ).

Last Updated : Sep 3, 2018, 08:31 PM IST
సోషల్ మీడియాలో ఖాతా ఉంటేనే.. పార్టీ టికెట్

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టికెట్ ఆశిస్తున్న వారికి కొత్త షరతులు విధించింది మధ్య ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ). సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌‌లలో ఖాతాలతో పాటు  వాట్సాప్‌ గ్రూపు కలిగి ఉండాలని వెల్లడించింది. ఈ మేరకు ఎంపీసీసీ సోమవారం ఓ లేఖను విడుదల చేసింది.

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులకు ఫేస్‌బుక్‌లో 15 వేల లైక్‌లు ఉండాలని నిబంధన విధించింది. అలాగే ట్విట్టర్‌లో 5 వేల మంది ఫాలోయర్స్‌ ఉండాలని, బూత్‌ లెవెల్‌ వర్కర్స్‌తో వాట్సాప్‌ గ్రూపు కలిగి ఉండాలని షరతు విధించింది. ఎంపీసీసీ ప్రతి ట్వీట్‌కు అభ్యర్థులు సమాధానం ఇవ్వాలని మరొక నిబంధన విధించింది. పార్టీ అధికారిక పేజీల్లో పోస్టులను తమ పేజీల్లో షేర్‌ చేయాలని సూచించింది.  మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే నేతలందరూ సెప్టెంబర్ 15కల్లా  సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను పార్టీకి అందజేయాలని సూచించింది.

 

Trending News