Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి

Bharat Biotech Covaxin Emergency Use: గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2021, 08:51 AM IST
Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి

Covaxin Emergency Use: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవిడ్19 వ్యాక్సిన్ కోవాగ్జిన్. ఈ టీకాను అత్యవసర వినియోగాని (Emergency Use listing of Covaxin)కి అనుమతించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అన్ని పత్రాలను భారత్ బయోటెక్ సమర్పించింది. త్వరలోనే ఆమోదం లభిస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల దీనిపై సోమవారం మీడియాతో మాట్లాడారు. అత్యవసర వినియోగానికి ఉపయోగించే వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్‌ (Bharat Biotech Covaxin)ను చేర్చాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు జులై 9న పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి. ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చి కరోనా మహమ్మారిని నియంత్రించాలని భావిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.

Also Read: Coffee Benefits: ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారా, అయితే కోవిడ్-19 గురించి ఇది తెలుసుకోండి

ఫైజర్ - బయో‌ఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా - ఎస్కే బయో/SII, జాన్సన్ అండ్ జాన్సన్ జాన్సీన్, మోడెర్నా మరియు సినోఫామ్ లాంటి కోవిడ్-19 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆమోదించింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ప్రమాదకర డెల్టా కోవిడ్-19 వేరియంట్‌పై 63.6 శాతం ప్రభావం చూపుతోంది. డెల్టా వేరియంట్ (Delta Variant Of Covid-19) ప్రపంచ వ్యాప్తంగా ఎనబైకి పైగా దేశాలలో వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో సైతం గతంలో వెల్లడించింది. కరోనా లక్షణాలున్న వారిపై 93.4 శాతం ప్రభావం చూపగా, కోవిడ్ బారిన పడినా లక్షణాలు లేని వారిలో 63.6 శాతం ప్రభావం చూపినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. 

Also Read: Covaxin: ఆ రెండు Covid-19 వేరియంట్లపై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు, అధ్యయనంలో వెల్లడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News