Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Diwali Bonus For Govt Employees: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి బోనస్‌గా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 80 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 02:18 PM IST
Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Diwali Bonus For Govt Employees: ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీపావళి కానుక ప్రకటించారు. గ్రూప్ బి, గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగులకు రూ.7 వేల వన్-టైమ్ బోనస్‌ ఇస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూడేళ్లకుపైగా పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు రూ.1,200 అందజేస్తామని తెలిపారు. ఈ వన్ టైమ్ బోనస్ చెల్లింపు కోసం ప్రభుత్వం సుమారు రూ.56 కోట్లు వెచ్చించనుందని చెప్పారు. “ఉద్యోగుల కృషి వల్లే ఢిల్లీని.. ఢిల్లీ ప్రజల ఆకాంక్షల నగరంగా మార్చగలిగాం. గ్రూప్ బి నాన్ గెజిట్, గ్రూప్ సి ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం రూ.7 వేల బోనస్ అందిస్తుంది. వీళ్లు దాదాపు 80 వేల మంది ఉన్నారు. ఇందుకోసం రూ.56 కోట్ల ఖర్చు అవుతుంది' అని కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు.

బోనస్ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతుందని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించామని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఇలానే కొనసాగుతాయని.. దీపావళి పండుగకు ముందు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ తన కుటుంబం అని.. ఈ పండుగ నెలలో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ ఇస్తున్నామని చెప్పారు.  

మరోవైపు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించేందుకు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సెక్రటేరియట్‌లో పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీగా పెరుగుతున్న వాయు కాలుష్య సంక్షోభాన్ని నియంత్రించడానికి.. ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించేందుకు సమావేశం నిర్వహించారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాలుగు దశ అమలును పర్యవేక్షించే చర్యలపై ఆరా తీశారు. 

ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 'తీవ్రమైన' క్యాటగిరీలో చేరింది. సోమవారం ఉదయం AQI 471గా నమోదైంది. 400 నుంచి 500 మధ్య ఉన్న AQI సాధారణ జనాభా ఆరోగ్యానికి హానికరంగా పరిగిణిస్తారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు, వృద్ధులు, చిన్న పిల్లలు శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Also Read: Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News