ఉత్తర భారతాన్ని హడలెత్తిస్తున్న ఇసుక తుఫాన్లు

ఉత్తరాది రాష్ర్టాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో సోమవారం రాత్రి ఇసుక తుఫాను మరోసారి హడలెత్తించింది.

Last Updated : May 8, 2018, 10:00 AM IST
ఉత్తర భారతాన్ని హడలెత్తిస్తున్న ఇసుక తుఫాన్లు

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ర్టాలైన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో సోమవారం రాత్రి ఇసుక తుఫాను మరోసారి హడలెత్తించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులు, ఇసుక తుఫాన్ విధ్వంసం సృష్టించాయి. ఢిల్లీతోపాటు సరిహద్దు ప్రాంతాలైన గురుగ్రామ్, నోయిడాలలో ఇసుక తుఫాను వణికించింది. చెట్లు నేలకూరాయి, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నేడు అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

 

ఇసుక తుఫాను ప్రభావంతో మీరట్‌లో విద్యాసంస్థలకు నేడు సెలవు దినంగా ప్రకటించారు. రాజస్థాన్‌లో కూడా ఇసుక తుఫాను ప్రభావం కొనసాగుతున్నది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తుఫానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది.

జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. ఈదురుగాలులు, తుఫానులు, ఉరుములు, మెరుపుల కారణంగా గత వారం కారణంగా ఐదు రాష్ట్రాల్లో 124 మంది మరణించారు. 300పైగా మంది మంది గాయపడ్డారు.

 

 

 

 

Trending News