Naveen Kumar Jindal: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం..కొనసాగుతున్న బెదిరింపుల పర్వం..!

Naveen Kumar Jindal: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టైలర్ కన్హయ్య లాల్‌ హత్యోదంతం తీవ్ర కలకలం రేపుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 29, 2022, 03:27 PM IST
  • ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
  • కలకలం రేపుతున్న కన్హయ్య ఘటన
  • నేతలకు బెదిరింపులు
Naveen Kumar Jindal: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం..కొనసాగుతున్న బెదిరింపుల పర్వం..!

Naveen Kumar Jindal: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టైలర్ కన్హయ్య లాల్‌ హత్యోదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈక్రమంలోనే బీజేపీ బహిష్కృత నేత నవీన్‌ జిందాల్‌, ఆయన కుటుంబసభ్యులకు బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ నవీన్‌ జిందాల్‌కు ఈ-మెయిల్‌లో బెదిరింపు లేఖలు పంపారు. లెటర్‌కు కన్హయ్యను చంపిన వీడియోను ఎటాస్‌ చేసి పంపించారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై పెను దుమారం రేగింది. దీంతో నవీన్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఈఅంశంపై పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి. మరోవైపు కన్హయ్య ఘటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు.

దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. హత్యలు చేయమని ఏ చట్టం చెప్పదని..చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని అన్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఇద్దరు యువకులు టైలర్‌ దుకాణంలోకి ప్రవేశించారు. టైలర్‌ కన్హయ్యతో మాటలు కలిపి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో వ్యక్తి తల, మెడపై దాడి చేశారు. ఈఘటనకు సంబంధించిన వీడియోలను ఫోన్‌లో రికార్డు చేశారు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈసమయంలో నిందితులు పలు అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని హత్య చేస్తామంటూ అభ్యంతకరంగా మాట్లాడారు. కన్హయ్య లాల్‌ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు షేర్‌ చేసిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. వీటిని వైరల్‌గా మార్చొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also read:Udaipur murder case: కన్హయ్య లాల్ హంతకుడికి ఐసీస్ ఉగ్రవాదులతో లింక్? ఉదయ్ పూర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

Also read: Dollar Vs Rupee: డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోందా..మనకు లాభామా..నష్టమా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News