ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. భవనం లోపలే చిక్కుకున్న 10 మంది

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Aug 22, 2018, 02:09 PM IST
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. భవనం లోపలే చిక్కుకున్న 10 మంది

ముంబైలోని పరెల్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్‌లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ సినిమా థియేటర్‌కి సమీపంలో ఉన్న క్రిస్టల్ టవర్ అనే భవనంలో 12వ అంతస్తులో పెద్ద ఎత్తున అంటుకున్న మంటలు కొద్ది క్షణాల వ్యవధిలోనే 13, 14, 15 అంతస్తులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో 10 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. లోపల చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

 

 

 

మొదట 10 ఫైర్ ఇంజన్లు ఘటనస్థలికి చేరుకోగా ప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో అగ్నిమాపక శాఖ అధికారులు మరో 10 ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొద్దిసేపట్లో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

Trending News