Fourth Wave Alert: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

India Covid-19: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. నిన్నటితో పోలిస్తే  కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 10:31 AM IST
  • దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
  • క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన కేసులు
  • ఫోర్త్ వేవ్ భయాందోళనలో ప్రజలు
Fourth Wave Alert: దేశంలో మళ్లీ  పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?

Covid-19 Cases In India: దేశంలో కరోనా కేసుల రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడో వేవ్ తర్వాత భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు.. మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ (Fourth Wave Scare )వస్తుందోమోనని ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో  అయితే రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని సగం కేసులు అక్కడే వస్తున్నాయి. వైరస్ ఉద్ధతి పెరుగుతన్న నేపథ్యంలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో మాస్కును తప్పనిసరి చేశారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యలను కూడా పెంచుతున్నారు.

దేశంలో తాజాగా 2,593 మందికి కరోనా పాజిటివ్​గా (Corona Cases in India) నిర్ధారణ అయింది.  వైరస్ తో కొత్తగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,755 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 57 వేల 545కి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేల 193గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59శాతానికి పైగా నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల (Covid-19 Active Cases in India) సంఖ్య 15,873 (0.04శాతం)గా ఉంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,19,479గా (98.75 శాతం) ఉంది. 

Also Read: Fourth wave scare: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ భయాందోళనలో ప్రజలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News