తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. అందుకు కారణాలు

తగ్గుతున్న బంగారం వెండి ధరలు.. అందుకు కారణాలు

Last Updated : Mar 8, 2019, 02:05 PM IST
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. అందుకు కారణాలు

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత వారం రోజులుగా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.360 మేర తగ్గి రూ. 33,070 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ. 33,070 కాగా 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 32,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్‌ బంగారం ధర 1,284.77 డాలర్లు పలుకుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ కొంత బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వ్యాపారం కొంత బలహీనపడటంతోపాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడం వంటివి బంగారం ధరలు పడిపోవడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఇదిలావుంటే, వెండి ధరలు సైతం రూ. 520 క్షీణించి కిలో రూ. 38,980కి చేరింది. నాణేల తయారీదారులు, పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ తగ్గడమే వెండి ధరల తగ్గడానికి కారణమైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Trending News