దేశంలో చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లోని గురేజ్ ప్రాంతంలోని గోవింద్ నల్లా వద్ద ఉగ్రవాదులకు, భద్రతాదళాలు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Last Updated : Aug 7, 2018, 02:06 PM IST
దేశంలో చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లోని గురేజ్ ప్రాంతంలోని గోవింద్ నల్లా వద్ద ఉగ్రవాదులకు, భద్రతాదళాలు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మేజర్ ర్యాంక్ స్థాయి హోదా గల అధికారితో పాటు ముగ్గురు సైనికులు మరణించారు. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఉగ్రవాదులు పంద్రాగస్టు టార్గెట్ చేశారని.. సరిహద్దు గుండా దేశంలో చొరబడి బీభత్సం సృష్టించవచ్చని నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను భారత ఆర్మీ ఏకి పారేస్తోంది.

మంగళవారం తెల్లవారుజామున నియంత్ర‌ణరేఖ దాటి 8మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయ‌త్నించారు. శ్రీన‌గ‌ర్‌కు 125 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గురేజ్‌ వద్ద ఈ చొర‌బాటు జరుగుతోందన్న పక్కా సమాచారంతో భారత ఆర్మీ అక్కడికి వెళ్లి.. ఉగ్రవాదుల‌ను మట్టుబెట్టింది. మరిన్ని భ‌ద్రతాద‌ళాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

రాజస్థాన్‌లో కలకలం రేపిన పాకిస్థాన్ బెలూన్లు

రాజస్థాన్‌‌లో పాకిస్థాన్ పేరుతో బెలూన్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండో-పాక్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న శ్రీగంగానగర్‌ జిల్లాలో రెండు బెలూన్లపై  ‘పాకిస్తాన్‌, అండ్‌ ఐ లవ్‌’ అని రాసి ఉండటంతో స్థానికంగా కలకలం చెలరేగింది. బెలూన్ల గురించి స్థానికులు తెలిజేయడంతో  పోలీసులు అక్కడికి వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

 

Trending News