యాపిల్ డబ్బాల్లో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్

యాపిల్ డబ్బాల్లో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ 

Last Updated : Nov 8, 2018, 04:44 PM IST
యాపిల్ డబ్బాల్లో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్

యాపిల్ డబ్బాల్లో హెరాయిన్‌ని తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి యాపిల్ పండ్ల లోడుతో వస్తున్న ఓ ట్రక్కులో పట్టుబడిన నిందితుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కుప్వారా నుంచి ఢిల్లీకి బయల్దేరిన ట్రక్కును కాశ్మీర్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు జరపగా అందులో ఈ హెరాయిన్ పట్టుబడింది. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Trending News