అత్యాచారం కేసులో నిందితుడైన బాబా ఆశ్రమం నుంచి 600 మంది బాలికలు అదృశ్యం

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న దాతి మహరాజ్ బాబా

Last Updated : Jun 18, 2018, 11:38 AM IST
అత్యాచారం కేసులో నిందితుడైన బాబా ఆశ్రమం నుంచి 600 మంది బాలికలు అదృశ్యం

తన వద్ద పదేళ్లుగా శిష్యురాలిగా ఉన్న ఓ 25 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆధ్యాత్మిక వేత్త దాతీ మహారాజ్‌ బాబాకు చెందిన ఆశ్రమం నుంచి 600 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనే వార్త తీవ్ర కలకలం సృష్టించింది. తనను తాను దేవుడి స్వరూపంగా చెప్పుకునే దాతీ మహారాజ్‌ రాజస్థాన్‌లోని అల్వాస్‌లో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఆధ్యాత్మికవేత్తగా పేరుండటంతో చుట్టు పక్కల అనేక ప్రాంతాల నుంచి పలువురు ఈ అశ్రమంలో అనేక సంవత్సరాలుగా ఆశ్రయం పొందుతున్నారు. అలా తన ఆశ్రమంలో దాదాపు 700 మంది బాలికలు ఉన్నారని, వాళ్ల సంరక్షణ బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని దాతి మహరాజ్ బాబా గతంలో అనేకసందర్భాల్లో బహిరంగ వేదికలపై ప్రకటించాడు. 

అయితే, ప్రస్తుతం అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న బాబా ఆశ్రమంలో తాజాగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు అక్కడ ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలకు బదులుగా కేవలం ఓ 100 మంది మాత్రమే ఉండటం విస్తుగొలిపింది. మరి బాబా దాతీ మహరాజ్ చెప్పుకుంటున్నట్టుగా మిగతా 600 మంది బాలికలు ఎక్కడికెళ్లారనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లని అతడే వాళ్ల వాళ్ల ఇళ్లకు పంపించేశాడా ? లేక ఆశ్రమంలో ఇంకేమైనా జరగరానిది జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికిమించి ప్రస్తుతం బాబా దాతి మహరాజ్ సైతం పరారీలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

Trending News