ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Updated: Feb 11, 2018, 12:27 PM IST
ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మన్‌‌ఖుర్ద్‌ ప్రాంతంలోని మాయా హోటల్‌ సమీపంలో ఉన్న గోదాములో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఉదయం 6:30 గంటలకు ఉన్నట్టుండి మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 అగ్నిమాపక శకటాలతో ప్రమాదస్థలికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.