Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..ఆరెంజ్ హెచ్చరికలు జారీ

ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 07:01 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత
  • తెలంగాణలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
  • తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..ఆరెంజ్ హెచ్చరికలు జారీ

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. బయటకు రావాలంటేనే జనం జక్కుతున్నారు. ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సేద తీరేందుకు శీతల పానియాలను సేవిస్తున్నారు.  ప్రధాన రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. 

ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయన్నారు. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. వడదెబ్బ తగిలినవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు డీహెచ్. 

ఇటు ఏపీలోనూ భానుడు భగభగమంటున్నాడు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచే ఎండలు మండుతున్నాయి. చాలాచోట్ల చలివేంద్రాలు వెలిశాయి. పలు స్వచ్ఛంద సంస్థలు వీటిని ఏర్పాటు చేశారు. మరో ఐదురోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: Will Smith: విల్ స్మిత్‌పై చర్యలు తప్పవా..? ఉత్తర నటుడి అవార్డు కోల్పోనున్నాడా..?

Also Read: Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్‌ ఫైర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News