87 ఏళ్ల ఈ బామ్మ దేశానికే ఆదర్శం

ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'స్వచ్ఛ భారత్'కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.

Last Updated : May 5, 2018, 03:39 PM IST
87 ఏళ్ల ఈ బామ్మ దేశానికే ఆదర్శం

ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 'స్వచ్ఛ భారత్'కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. అందరూ సాధ్యమైనంత వరకు మరుగుదొడ్లను కట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ బామ్మ కూడా స్వయంగా మరుగుదొడ్డిని నిర్మించుకొని  వార్తల్లో నిలిచింది.. అలాగే దేశానికే ఆదర్శంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌ జిల్లా బదలి గ్రామానికి చెందిన 87 ఏళ్ల ఓ బామ్మ ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా సొంతంగానే మరుగుదొడ్డిని నిర్మించుకుంది. బహిరంగ విసర్జన వల్లే తలత్తే ఆరోగ్య సమస్యలపై జిల్లా అధికారులు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ కార్యక్రమాల ద్వారా అవగాహన ఏర్పడడంతో ఈ బామ్మ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వృద్ధురాలు మరుగుదొడ్డి కట్టుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకున్నా.. రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. చిన్న చిన్న ఇటుక రాళ్లు సేకరించి వారం రోజుల్లో సొంతంగా మరుగుదొడ్డిని నిర్మించుకుంది. దీనికి తన కొడుకు మట్టి సాయం చేశాడు అంతే. కాగా అంత పెద్ద వయసులో రాఖీ అనే బామ్మ చేసిన పని గురించి తెలుసుకుని అధికారులు షాకయ్యారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Trending News