శశికళ ఆస్తులపై 187 చోట్ల రైడ్..!

    

Last Updated : Nov 9, 2017, 05:04 PM IST
శశికళ ఆస్తులపై 187 చోట్ల రైడ్..!

అన్నాడియంకే నేత మరియు ప్రస్తుతం పలు అవినీతి కేసుల్లో భాగంగా జైలు జీవితం గడుపుతున్న శశికళ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక రైడింగ్ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ ప్రాంతాల్లో దాదాపు 187 చోట్ల ఈ రైడింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే శశికళ పెట్టుబడులు పెట్టిన జయ టీవీ ఆఫీసుతో పాటు జాజ్ సినిమా థియేటర్, కోద్నాడ్ ఎస్టేట్ ప్రాంతాల్లో కూడా అధికారులు రైడ్ నిర్వహించారు. అదేవిధంగా, మిదాస్ డిస్టిలరీ ప్లాంట్‌తో పాటు వ్యాపారవేత్తలు ఆర్ముగంస్వామి, విండ్ మిల్ సుబ్రమణి ఇళ్ళలో కూడా రైడింగ్ జరిగినట్లు సమాచారం. "ఆపరేషన్ క్లీన్ మనీ"లో భాగంగా ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్న వ్యక్తుల ఇళ్ళను సంచరిస్తున్నారు. ఈ రైడింగ్ కూడా అందులో భాగమే అని అధికారులు తెలిపారు. తంజావూరులో నివసిస్తున్న శశికళ భర్త నటరాజన్, శశికళ మేనల్లుడు దినకరన్ ఆఫీసులకు కూడా రైడింగ్ నిమిత్తం ఆదాయపు పన్ను అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. తమ రైడింగ్‌లో భాగంగా కర్ణాటక వెళ్లిన అధికారులు అక్కడ అన్నాడియంకే పార్టీ రాష్ట్ర యూనిట్ కార్యదర్శి పుగలేంది ఇంటికి కూడా వెళ్లి పలు వివరాలు అడిగారు. 

Trending News