Covid-19 fourth wave scare: దేశంలో కరోనా కలవరం... కొత్త కేసులు ఎన్నంటే?

India Covid-19: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 3,714 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మరో ఏడుగురు మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 09:59 AM IST
Covid-19 fourth wave scare: దేశంలో కరోనా కలవరం... కొత్త కేసులు ఎన్నంటే?

Covid-19 fourth wave scare in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 మందికి కరోనా పాటిజివ్ (Corona Cases in India)గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 2,513 మంది కోలుకున్నారు. దీంతో మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా నమోదైంది. నిన్న 3,07,716 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మెుత్తం కేసుల సంఖ్య 4,31,85,049 కాగా...మెత్తం మరణాల సంఖ్య 5,24,708గా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,976గా నమోదైంది. భారత్​లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. సోమవారం 13,96,169 మందికి కొవిడ్ టీకాలు వేశారు. మెుత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. 

వరల్డ్ వైడ్ గా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.  నిన్న ఒక్కరోజే 3 లక్షల 27 వేలకుపైగా కేసులు వచ్చాయి. వైరస్ ధాటికి మరో  754 మంది మృతి చెందారు. ఉత్తర కొరియాలో 66 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. అగ్రరాజ్యం అమెరికాలో మరో 54 వేలకుపైగా కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. 

Also Read: Indian Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్కంఠ..ఈసారి ఎవరో తెలుసా..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News