Corona cases in India: రెండు వేలకి దిగువన కరోనా కేసులు.. వందకు పైగా మరణాలు

గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి భారత్ లో తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రెండువేల లోపు కేసులు నమోదవ్వగా వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ వివరాలు... 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 11:07 AM IST
  • దేశంలో కట్టడిలోనే కరోనా వైరస్
  • తాజాగా వెలుగులోకి 1761 కొత్త కేసులు
  • 24 గంటల్లో కరోనాతో 127 మంది మృతి
Corona cases in India: రెండు వేలకి దిగువన కరోనా కేసులు.. వందకు పైగా మరణాలు

Corona cases in India: దేశంలో కరోనా వైరస్‌ కట్టడిలోనే ఉంది. గత కొంత కాలంగా 3 వేల దిగువనే నమోదుతున్న కేసులు.. తాజాగా 17 వందలకు చేరింది. ఐతే మరణాలు మాత్రం వందకు పైగా నమోదు అవుతున్నాయి. ఈ మేరకు కేంద్రం బులిటెన్ చేసిన వివరాల ప్రకారం... గడిచిన 24 గంటల్లో 4 లక్షల 31 వేల 973 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17 వందల 61 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజాగా కరోనాతో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దీంతో మరణాల సంఖ్య 5 లక్షల 16 వేల 479కి చేరింది. 24 గంటల్లో 3 వేల 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకు 4.24 కోట్ల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ రేటు 98.74 శాతానికి చేరింది. రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 26 వేల 240 యాక్టివ్‌ కేసులున్నాయి. 

మరోవైపు దేశంలో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15 లక్షల 34 వేల 444 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 181 కోట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం 12 నుంచి 14 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 

Also Read: Samantha Yashoda Movie: సమంత 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!!

Also Read: Today Horoscope March 20 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News