బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం.. జపాన్ విధానాలు స్టడీ చేస్తున్న భారత్..!

భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ సాంకేతిక విధానాలను స్టడీ చేయడానికి భారత్ సంకల్పించింది. 

Last Updated : Nov 10, 2018, 04:13 PM IST
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం.. జపాన్ విధానాలు స్టడీ చేస్తున్న భారత్..!

భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ సాంకేతిక విధానాలను స్టడీ చేయడానికి భారత్ సంకల్పించింది. జపాన్ షిన్కాన్సెన్ రైళ్ళలో కేవలం ఏడు నిముషాల్లోనే ట్రైన్ క్లీన్ చేయడం, మినిమమ్ బ్యాగేజీతోనే ప్రయాణికులకు ఎంట్రీ ఇవ్వడం లాంటి పద్ధతులకు ఎప్పటినుండో శ్రీకారం చుట్టారు. జపాన్ హై స్పీడ్ నెట్ వర్క్‌లో పనులను వేగవంతంగా చేయడం కోసం అనేక సులభమైన విధానాలను పాటిస్తున్నారు. భారతదేశానికి చెందిన నేషనల్ హైస్పీడ్ రైల్  కార్పొరేషన్ ఆ విధానాలను స్టడీ చేసేందుకు 300 మంది సిబ్బందిని ట్రైనింగ్ నిమిత్తం జపాన్ పంపించనుందట.

జపాన్‌లో సమయాన్ని వృధా కానివ్వకుండా.. పనులన్నీ సక్రమంగా చేసేందుకు పలు టెక్నిక్స్‌ను పాటిస్తున్నారు. అక్కడి సిబ్బందికి ఇచ్చే ప్రత్యేకమైన శిక్షణ వల్ల వారు కేవలం 7 నిముషాల్లోనే బుల్లెట్ ట్రైన్ మొత్తాన్ని శుభ్రపరుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని.. అలాగే ఓవర్ లోడ్ లగేజీలతో ప్యాసింజర్లు ఎప్పుడూ రైలులోకి రారని.. అందుకు వేరే లోడింగ్,  అన్ లోడింగ్ పాయింట్లు ఉంటాయని.. ఈ విధానాలను భారతీయులు స్టడీ చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు. 

జపాన్‌లో కేవలం 12 నిముషాల్లోనే రైలు రావడం, వెళ్లిపోవడం కూడా జరిగిపోతుందని... ప్యాసింజర్లు కూడా అనుకున్న సమయానికి రెడీగా ప్లాట్ ఫారమ్ మీదకి వస్తారని.. ఒక రకంగా బుల్లెట్ ట్రైన్స్ నడపటం అంటే కత్తిమీదసాము లాంటి పని అని.. కానీ జపాన్ అందులో విజయం సాధించిందని దీక్షిత్ అన్నారు. ప్రస్తుతం దీక్షిత్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకి బాధ్యత వహిస్తున్నారు. 

Trending News