Isha Ambani: ఇషా అంబానీకి అరుదైన గౌరవం...Smithsonian Museum బోర్డు సభ్యురాలిగా ఎంపిక

Smithsonian Museum: ముఖేశ్‌ అంబానీ కూతురు ఇషా అంబానీకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డులో స్థానం లభించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 03:43 PM IST
Isha Ambani: ఇషా అంబానీకి అరుదైన గౌరవం...Smithsonian Museum బోర్డు సభ్యురాలిగా ఎంపిక

Isha Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ(Mukesh Ambani) గారాల పట్టి ఇషా అంబానీ(Isha Ambani)కి అరుదైన గౌరవం దక్కింది. ఈమె ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌(Smithsonian’s National Museum of Asian Art) బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం.

Also Read: Income Tax Notices: రిక్షా కార్మికుడికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులు

స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ని 1923లో అమెరికాలో వాషింగ్టన్‌ డీసీ(Washington DC)లో  ప్రారంభించారు. ఈ మ్యూజియంలో అనేక అద్భుత కళాఖండాలు ఉన్నాయి.  ఇండియా, మెసపోటనియా, జపాన్‌, చైనాలకు చెందిన 45,000లకు పైగా చారిత్రక చిత్రాలు, శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రాతి యుగం నుంచి నేటి అధునాత యుగం వరకు ఏషియా నాగరికతను పట్టిచ్చే కళాఖండాలు ఇక్కడ కొలువుదీరాయి. రాబోయే 2023లో వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలను నిర్వహించే బాధ్యత కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యుల మీదే ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News