Karnataka New Cabinet 2023: కర్ణాటక కేబినెట్‌లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు

Karnataka New Cabinet 2023: కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్‌ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కర్ణాటక కొత్త కేబినెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంల పేర్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2023, 09:06 PM IST
Karnataka New Cabinet 2023: కర్ణాటక కేబినెట్‌లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు

Karnataka New Cabinet 2023 News Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనే సస్పెన్స్‌కి తెర వీడింది. ఇక మిగిలిందల్లా కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్‌ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కర్ణాటక కేబినెట్లో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారని తెలుస్తోంది. 

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని.. సంబంధిత నేతలతో చర్చిస్తున్న కాంగ్రెస్ పార్టీ  హైకమాండ్ ఇంకొన్ని గంటల్లోనే ఆ పేరును అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలావుండగా ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంల పేర్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు లింగయత్ సామాజిక వర్గం నుంచి కాగా మరొకరు వొక్కలిగ సామాజిక వర్గం, ఇంకొకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఉండనున్నారని తెలుస్తోంది.

Trending News