Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై

Ayanur Manjunath Quits From BJP: కర్ణాటకలో ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు అధికార బీజేపీకి రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారో ఇంకా ప్రకటించలేదు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 01:55 PM IST
Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై

Ayanur Manjunath Quits From BJP: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్ ఆ పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. శివమొగ్గ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు అయనూర్ మంజునాథ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్న ఆయన ప్రకటించారు. బుధవారం హుబ్లీ వెళ్లి స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. శివమొగ్గ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఈ నెల 20న తాను ఒక పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు. నా నియోజకవర్గ ప్రజలు, అభిమానుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇప్పటికే తన నాయకులు, శ్రేయోభిలాషులతో మాట్లాడాను. అందరూ ఆమోదంతోనే బీజేపీని వీడుతున్నా. ఈరోజు సాయంత్రం విధాన సభ చైర్మన్‌ బసవరాజ్‌ హోరట్టిని కలిసి.. రాజీనామా పత్రాన్ని అందజేస్తున్నా..' అని మంజునాథ్ వెల్లడించారు. బీజేపీ  టికెట్ నిరాకరించినందుకు తాను పార్టీని వీడటం లేదని.. నగర అభివృద్ధికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందన్నారు. 

హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌కు బీజేపీ ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్తవారికి అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో శెట్టర్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్టీకి గుడ్‌ బై చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన జగదీష్ శెట్టర్‌ రాజీనామాతో బీజేపీపై భారీ ఎఫెక్ట్ పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read: Karnataka Assembly Elections: చదివింది తొమ్మిదో తరగతి.. రూ.1,609 కోట్లకు అధిపతి.. మంత్రి ఆస్తుల వివరాలు వెల్లడి

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హీట్ ఉంది. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో మే 10న పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ.. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.

Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News