Karnataka Corporator Daughter Murder: క్యాంపస్ లో ఘోరం.. ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై 9 సార్లు కత్తిపోట్లు.. వీడియో వైరల్..

Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2024, 08:37 AM IST
  • ప్రేమ పేరుతో యువతికి వేధింపులు..
  • క్యాంపస్ లో యువకుడి పైశాచీకం..
Karnataka Corporator Daughter Murder: క్యాంపస్ లో ఘోరం.. ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై 9 సార్లు కత్తిపోట్లు.. వీడియో వైరల్..

karnataka Congress Corporator Daughter Brtully Stabble To Death: చాలా మంది యువత ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమలో కొన్నిరోజుల పాటు ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు.దీనిలొ ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలు మరోకరు అర్దం చేసుకొవడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని నచ్చితే పెళ్లి వరకు వెళ్తున్నారు. ఒక వేళ ఏమైన బేధాభి ప్రాయాలు వస్తే మాత్రం బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. కొందరు యువత పెళ్లికి ముందే లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉంటున్నారు. కొందరు యువతకు ప్రేమను అంగీకరించకుంటే మాత్రం ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన వాళ్లను చంపడం లేదా బలవంతంగా వివాహాం చేసుకొవడం చేస్తున్నారు. మరికొందరు సుపారీలు ఇచ్చి చంపించడానికి సైతం వెనుకాడటంలేదు.ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. కొన్నిచోట్ల లవ్ జీహాదీల వల్ల ప్రేమించి, యువతులను మోసాలు చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అచ్చం ఇలాంటి కోవకుచెందిన ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రస్తుతం ఇది తీవ్ర సంచలనంగా మారింది.

 

పూర్తి వివరాలు..

కర్ణాటకలోని హుబ్బల్లిలో దారుణ ఘటన జరిగింది.  కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తెను ఆమె కళాశాల క్యాంపస్‌లో ఆమె సీనియ్ విద్యార్థి గురువారం హత్య చేశారు. తన ప్రేమను నిరాకరించినందుకు అత్యంత క్రూరంగా క్యాంపస్ లోనే యువతిని చంపినట్లుగా తెలుస్తోంది. నిందితుడు ఫయాజ్‌ను పోలీసులు ఘటన తర్వాత అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేహా (23) కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమత్‌ కుమార్తె. ఆమె BVB కాలేజీలో మొదటి సంవత్సరం మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) చదువుతుంది. ఈ క్రమంలో..నిందితుడు ఫయాజ్ (23) కూడా నేహా మాజీ క్లాస్‌మేట్.  ఆమెను పలుమార్లు ప్రేమిస్తున్నట్లు వేధించాడు. కానీ ఆమె మాత్రం ఇతని ప్రేమను నిరాకరించింది.దీంతో కోపం పెంచుకున్న ఫయాజ్‌.. కత్తి తీసుకొని వచ్చి కాలేజీలో యువతిపై పాశావికంగా దాడిచేశాడు. క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఫయాజ్ నేహాను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోతున్నట్లు రికార్డు అయ్యింది. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల సిబ్బంది,  ఇతర విద్యార్థులు నేహాను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. కాగా, హుబ్బళ్లిలోని విద్యానగర్ పోలీసుల సహకారంతో పోలీసులు ఫయాజ్‌ను పట్టుకున్నారు.

హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార్ మాట్లాడుతూ, గురువారం.. సాయంత్రం 4.45-5 గంటల సమయంలో, BVB కళాశాలలో MCA చదువుతున్న బాలిక నేహా యొక్క మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి చేసి,6-7 సార్లు పొడిచినట్లు తెలిపారు.యువతి యువకులు..  కలిసి చదువుకోవడం వల్ల ఒకరికొకరు తెలుసని.. ఇంటరాగేషన్ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. 

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

నేహా తల్లి గీత మీడియాతో మాట్లాడుతూ.. పికప్ చేయడానికి వచ్చి ఆమెతో ఒకసారి ఫోన్‌లో మాట్లాడాను. మా సంభాషణ జరిగిన ఐదు నిమిషాల్లోనే గందరగోళం చెలరేగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఎవరో ఆమెను కత్తితో పొడిచినట్లు కేకలు విన్పించాయని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించి నేహా హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ అనుకూల సంఘాలు, బీజేపీ మద్దతుదారులు విద్యానగర్ పోలీస్ స్టేషన్ బయట కూడా నిరసనకు దిగారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News