Karnataka: కర్ణాటకలో క్యూఆర్ కోడ్ దాడులు, PayCM పోస్టర్లు జారీ చేసిన కాంగ్రెస్

Karnataka: కర్నాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోస్టర్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకటి పోస్టర్లతో దాడులు చేస్తున్నాయి. పేసీఎం అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన చేపట్టింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2022, 10:21 PM IST
Karnataka: కర్ణాటకలో క్యూఆర్ కోడ్ దాడులు, PayCM పోస్టర్లు జారీ చేసిన కాంగ్రెస్

Karnataka: కర్నాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోస్టర్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకటి పోస్టర్లతో దాడులు చేస్తున్నాయి. పేసీఎం అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన చేపట్టింది. 

కర్నాకటలో అధికార పార్టీ బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య గత కొద్దిరోజులుగా పోస్టర్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ అవినీతికి వ్యతిరేకంగా ఒకరిపై మరొకటి ఆరోపణలు సంధించుకుంటున్నాయి. పోస్టర్లు కూడా వినూత్నంగా ఉంటున్నాయి. క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు ప్రదర్శిస్తూ అవినీతి ఏ స్థాయిలో ఉందనేది పరోక్షంగా సూచిస్తున్నాయి. కాంగ్రెస్ ముందుగా PayCM అంటూ పోస్టర్ జారీ చేసింది. ఆ తరువాత బీజేపీ సైతం విపక్ష నేత సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల ముఖ చిత్రాన్ని ప్రతిబింబించే క్యూఆర్ కోడ్ పోస్టర్లు విడుదల చేసింది.

PayCM పోస్టర్‌పై ముఖమంత్రి బసవరాజ బొమ్మై ముఖచిత్రంతో క్యూఆర్ కోడ్ స్పష్టంగా ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్‌పైభాగంలో 40 శాతం సర్కార్.కామ్ అని రాసుంది. ఈ పోస్టర్‌తో రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య రాజకీయం వేడెక్కింది. బెంగళూరు గోడలు, ఇతర ప్రదేశాల్నించి పోస్టర్లను తొలగించాలని బెంగళూరు మెట్రోపాలిటన్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. 

బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై విమర్శలు సంధించారు. నాలుగు తరాల వరకూ సరిపడేంత సంపాదించారని ఆరోపించారు. దీనికి సమాధానంగా తాము జారీ చేసిన పేసీఎం పోస్టర్లు వ్యక్తిగతం కాదని..అన్ని చోట్లా నడుస్తున్న చర్చనే ప్రచారం చేస్తున్నామని కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్డ్ ప్రియాంక ఖడ్గే తెలిపారు. 

Also read: Viral Post: సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అయితే మాకొద్దు... వైరల్ గా మారిన వధువు పేరెంట్స్ పెళ్లి ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News