ముద్దుల పోటీ పెట్టి బహుమతులిచ్చిన ఎమ్మెల్యే

ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ జార్ఖండ్ లో ఒక కార్యక్రమం జరిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు.

Last Updated : Dec 11, 2017, 11:48 AM IST
ముద్దుల పోటీ పెట్టి బహుమతులిచ్చిన ఎమ్మెల్యే

ఆధునికతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ జార్ఖండ్ లో ఒక కార్యక్రమం జరిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు గాఢంగా ముద్దులు పెట్టుకున్నారు. గెలిచినవారికి బహుమతి ఇచ్చారు. దీనికి  చీఫ్ గెస్ట్ ఒక ఎమ్మెల్యే. వివరాల్లోకి వెళితే.. 

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే నాసైమన్ మరాండీ  స్వగ్రామం తాల్ పహాడీ  లో ముద్దుల పోటీలు జరిగాయి. ఈ పోటీలో పాల్గొన్నవారందరూ ఆదివాసీయులే. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ప్రేక్షకులను అలరించారు. ఎవరైతే ఎక్కువ సేపు ముద్దుపెట్టుకున్నారో వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. 

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదివాసీయుల్లో మాడ్రడైజేషన్ పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఇలా ముద్దులు పెట్టుకొని తమ అభిప్రాయాలు తెలియజేయటంవల్ల ప్రేమ చిగురిస్తుందని చెప్పారు. కానీ ఇలాంటి వివాదాస్పద కార్యక్రమానికి ఒక ప్రజాప్రతినిధి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధునికత అంటే ముద్దులు పెట్టుకోవడమేనా? అంటూ ప్రజాసంఘాలు, మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. 

Trending News