Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..

Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో తొలి విడత ప్రచారానికి నిన్నటితో (17-4-2024) తెర పడింది. రేపు తమిళనాడులోని 39 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 102 లోక్‌ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 18, 2024, 05:40 AM IST
Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర..  తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే  పోలింగ్..

Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. అందులో తొలి విడత ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. రాజకీయ పార్టీల ప్రచారంతో హోరెత్తిన ప్రచారం మూగపోయింది. మొత్తం 21 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు (శుక్రవారం) పోలింగ్ జరగనుంది.

ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలతో పాటు రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్య ప్రదేశ్‌లోని 6 స్థానాలు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సామ్ రాష్ట్రాల్లో ఐదేసి చొప్పున .. బిహార్‌, పశ్చిమబంగలో మూడేసి చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లలతో 2 లోక్ సభ స్థానలతో పాటు ఛత్తీస్ ఘడ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క లోక్ సభ సీట్లకు ఏప్రిల్ 19న ఎన్నికల జరగనున్నాయి.

ఫస్ట్ ఫేస్‌లో జరిగే ఎన్నికల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు.. ఇద్దరు మాజీ సీఎంలు.. తెలంగాణ మాజీ గవర్నర్  తమిళ సై సహా పలువురు బరిలో ఉన్నారు. నాగ్ పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి విజయంతో హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటు చెన్పై సెంట్రల్ నుంచి తమిళ సై
సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నారు.  అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బరిలో ఉన్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు ఆయన విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ .. మాజీ సీఎం పెమా ఖండు బరిలో ఉన్నారు. అస్సామ్‌లోని డిబ్రూగడ్ నుంచి కేంద్ర మంత్రి.. అస్సామ్ మాజీ సీఎం సర్భానంద్ సోనోవాల్ బరిలో దిగుతున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్, తమిళనాడు బీజేపీ మాజీ ఛీప్ ఎల్ . మురుగన్ వంటి వారు పోటీలో ఉన్నారు. వెస్ట్ త్రిపుర నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీలో ఉన్నారు. అటు తమిళనాడు బీజేపీ ఛీప్ కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.

ఏప్రిల్ 19న తొలి విడతా ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల శంఖారావం మొదలై.. ఏడు విడతల్లో దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1 జరిగే చివరి విడతతో ఈ ఎన్నికల క్రతువు ముగియనుంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.

Also Read: Bhadrachalam: జానకిని పెళ్లాడిన రామయ్య..  భద్రాచలంలో కల్యాణ వైభోగం

Trending News