Asaduddin Owaisi: ఏదో ఒకరోజు హిజాబ్ అమ్మాయి దేశ ప్రధాని కాగలదు

Asaduddin Owaisi: భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటీషు ప్రధాని కావడంతోనే రాజకీయ వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2022, 09:16 PM IST
Asaduddin Owaisi: ఏదో ఒకరోజు హిజాబ్ అమ్మాయి దేశ ప్రధాని కాగలదు

ఇండియన్ ఆరిజిన్ రిషి సునక్ బ్రిటీషు ప్రధానిగా ఎన్నిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దేశంపై..దేశంలోని రాజకీయాలపై ప్రభావం పడుతోంది. ఆ వివరాలు మీ కోసం..

రిషి సునక్ బ్రిటన్ దేశ ప్రధానిగా ఎన్నికవడంతోనే దేశంలో రాజకీయ వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి. దేశ అత్యున్నత స్థానంలో మైనార్టీలను ఎంచుకునే సాంప్రదాయాన్ని ఏదో ఒకరోజు దేశం పాటిస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్‌షా అల్లాహ్..నా జీవితంలో లేదా నా తరువాత హిజాబ్ ధరించే ఓ అమ్మాయి భారతదేశ ప్రధాని అవుతుందంటూ కర్ణాటకలోని బీజ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

అటు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా శశి థరూర్‌ని కోరింది. వాస్తవానికి రిషి సునక్ ప్రధాని ఎన్నికకు కొద్దిసేపటి క్రితమే శశి థరూర్ ట్వీట్ చేశారు. బ్రిటీషు ప్రజలు ప్రపంచానికి అసాధ్యమైన పనినే చేసి చూపించారని..అత్యంత శక్తివంతమైన కార్యాలయంలో మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించారని శశి థరూర్ వ్యాఖ్యానించారు. మనం భారతీయుడైన రిషి కోసం వేడుక చేసుకుందాం..ఇలా ఇండియాలో జరుగుతుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.

అటు కాంగ్రెస్ ముఖ్యనేత పి చిదంబరం కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు. మొన్న కమలా హ్యారిస్..ఇప్పుడు రిషి సునక్. అమెరికా, బ్రిటీషు ప్రజలు తమ దేశంలో మైనార్టీ ప్రజల్ని అక్కున చేర్చుకున్నారు. అక్కడి ప్రభుత్వంలో అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. ఇండియా, బహుసంఖ్యాక వర్గాల పాలకులు ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలంటూ చిదంబర్ ట్వీట్ చేశారు.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ ఛీప్ మహబూబా ముఫ్తీ కూడా రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటీషు ప్రజలు ఓ అల్పసంఖ్యాకవర్గపు వ్యక్తిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ మనం మాత్రం ఇప్పటికీ ఎన్ఆర్‌సీ, సీఏఏ వంటి విభజన, బేధభావాలుండే చట్టాల్ని తీసుకొస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

అటు బీజేపీ సైతం ఈ విషయంపై స్పందించింది. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ ఓ సమర్ధవంతమైన నేత అని కొనియాడింది. ఈ అసాధారణ విజయంపై ఆయనను ప్రశంసించాలని..కానీ కొన్ని ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించింది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతలు చిదంబరం, శశి థరూర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు.

భారతీయ మూలాలు కలిగిన ఓ సమర్ధవంతమైనత నేత రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అవుతున్నారు. ఈ అసాధారణ విజయాన్ని అందరూ కొనియాడాల్సిందే. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది రాజకీయ నేతలు దీనిపై కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

రిషి సునక్ ప్రధాని అవడంతో కొంతమంది బహుసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమయ్యారని..అలాంటివారికి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం, ప్రధానమంత్రిగా పదేళ్లపాటు చేసిన మన్మోహన్ సింగ్ విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నానన్నారు. ఇప్పుడు కూడా ఓ గిరిజన మహిళ దేశ రాష్ట్రపతిగా ఉన్నారని మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

Also read: SBI Warning: ఖాతాదారులకు ఎస్బీఐ కీలక సూచనలు.. అలా వెంటనే చేయండి లేదంటే ఇబ్బందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News