ఇవాంకా సదస్సులో పాల్గొని మోదీ చులకన అయ్యారు: ఆనంద్ శర్మ

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా.. అక్కడికి మోదీ వెళ్లవలసిన అవసరం ఏముంది?" అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు.

Last Updated : Nov 29, 2017, 01:44 PM IST
ఇవాంకా సదస్సులో పాల్గొని మోదీ చులకన అయ్యారు: ఆనంద్ శర్మ

హైదరాబాద్ లో జరుగుతున్న జీఈఎస్-2017 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాన మంత్రి హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఉన్న ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా.. అక్కడికి మోదీ వెళ్లవలసిన అవసరం ఏముంది?" అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సదస్సుకు ఒక ప్రధాన మంత్రి స్థానంలో ఉండి మోదీ హాజరుకాడం ద్వారా తన పదవికి చులకన తెచ్చారు. ఆల్రెడీ ఈ సదస్సులో ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్రమంత్రుల స్థాయి గల వ్యక్తులు పాల్గొంటున్నారు. ప్రధాని విదేశీ ప్రతినిధుల రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది?. గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. తన పరిపాలన ఎంత బాగుందో గుజరాత్ ప్రజలు సర్టిఫికెట్ ఇవ్వండి అని అడగాల్సింది" అని శర్మ అన్నారు.  

అయితే ప్రధాని జీఈఎస్ సదస్సులో పాల్గొనడాన్ని తప్పుపడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలను బీజేపీ నేతలు తప్పుబట్టారు. 'ఆయన అక్కడకు వెళ్ళింది మెట్రోను జాతికి అంకితం చేయడానికి' అన్నారు. అక్కడే జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు వెళ్లి.. భారత్ కు పెట్టుబడులు ఆకర్షించడానికి గల అవకాశాల గురించి మాట్లాడారన్నారు. ఏ.. భారత్ లో పెట్టుబడులు వద్దా? అని ఎద్దేవా చేశారు.

Trending News