Mumbai Covid-19: ముంబయిలో సున్నా కొవిడ్‌ మరణాలు...అదుపులోకి వచ్చిన వైరస్!

Mumbai: కొవిడ్ తో వణికిపోయిన దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఊపిరిపీల్చుకుంది. వైరస్ వెలుగు చూసిన తర్వాత తొలిసారి ముంబయిలో కొవిడ్ మరణాలు సున్నాకు పడిపోయాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 12:34 PM IST
  • ముంబయిలో 367 కొత్త కేసులు నమోదు
  • సున్నాకు పడిపోయిన కరోనా మరణాలు
  • దేశ ఆర్థిక రాజధానిలో అదుపులోకి వచ్చిన వైరస్
Mumbai Covid-19: ముంబయిలో సున్నా కొవిడ్‌ మరణాలు...అదుపులోకి వచ్చిన వైరస్!

Zero Covid Deaths in Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai) కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ముంబయి నగరంలో 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా సున్నా కొవిడ్‌ మరణాలు(Zero Covid Deaths in Mumbai) నమోదయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా అక్కడ కొవిడ్‌ మరణాలు సంభవించకపోవడం ఇదే తొలిసారి. 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) ధాటికి విలవిలలాడిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబయి మహానగరం కొవిడ్‌ ఉద్ధృతికి వణికిపోయింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో నిత్యం అక్కడ 11వేల కేసులు, వందల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 7లక్షల 50వేల కేసులు నమోదయ్యాయి. వారిలో 16,180 మంది మృత్యువాతపడ్డారు. అయితే, గతకొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోన్న ముంబయిలో తాజాగా రోజువారీ మరణాల సంఖ్య 0కి చేరడం సానుకూలాంశం.

Also read: Maharashtra: దాడులెందుకు..ధైర్యముంటే నేరుగా పోరాడమని సవాలు విసిరిన ఉద్ధవ్ థాక్రే

ముంబయిలో తాజాగా 367 కేసులు (1.27శాతం పాజిటివిటీ రేటు) బయటపడ్డాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5030కి చేరింది. మరణాల సంఖ్య సున్నాగా నమోదయ్యింది. ప్రస్తుతం ముంబయిలో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి శాతం 97గా ఉంది. ప్రస్తుతం అక్కడ కంటెయిన్‌మెంట్‌ జోన్లు కూడా లేవని గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News