NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిది

NDTV Opinion Poll 2024: దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్‌కు మరో రెండ్రోజులే సమయం మిగిలింది. ఈ నేపధ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎవరికెన్ని సీట్లో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2024, 08:08 PM IST
NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిది

NDTV Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల వేళ దాదాపు అన్ని సంస్థల సర్వేలు మోదీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని తేల్చిచెప్పాయి. కానీ మోదీ ఆశిస్తున్నట్టుగా 400 సీట్ల మార్క్ దాటడం కష్టమేనని చెప్పాయి. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వెల్లడించింది. మోదీ ఈసారి 400 సీట్ల మార్క్ చేరుకోకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని వెల్లడించింది. 

దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 365 సీట్లు సాధించనుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ తెలిపింది. గతం కంటే ఈసారి ఏన్డీయే 3.4 శాతం సీట్లు అధికంగా సాధించనుంది. ఈసారి ఇండియా కూటమి 122 సీట్లు సాధించనుందని ఎన్డీటీవీ వెల్లడించింది. ఈసారి ఎన్డీయే కూటమి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్లీన్‌స్వీప్ చేయనుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఇందులో ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చండీగడ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 75 ఎంపీ స్థానాలున్నాయి. యూపీ, బీహార్, మద్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కొనసాగనుంది. ఇక పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో మాత్రం హోరాహోరీ పోరు ఉంటుంది. దక్షిణాదిన బీజేపీకు మరోసారి నిరాశ తప్పదని తేలింది. 

ఎన్డీటీవీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టనుంది. మొత్తం 25 ఎంపీ సీట్లలో వైసీపీ 16 స్థానాలు దక్కించుకోనుంది. ఇదే ప్రభావం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందని ఎన్డీటీవీ తెలిపింది. ఇక 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు 9, బీజేపీకు 4, బీఆర్ఎస్ పార్టీకు 3, ఎంఐఎంకు 1 స్థానం దక్కనుంది. 

Also read: Best Drink for High BP: రోజుకో గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు, బీపీ ఎంత ఉన్నా ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News