First CoronaVirus Death In North India: గువాహటి: దేశంలో ఇప్పటివరకూ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోన్న ప్రాణాంతక వైరస్ తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో తొలి కరోనా మరణం నమోదైంది. అసోంకు చెందిన 65ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడి చనిపోయాడు. హైలాకంది జిల్లాకు చెందిన వ్యక్తి ఎస్‌ఎంసీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయాన్ని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ శుక్రవారం ఉదయం ట్వీట్‌లో వెల్లడించారు. నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం
ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలి కరోనా మరణం కాగా, చనిపోయిన వ్యక్తి బీఎస్‌ఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. శ్వాస సంబంధిత సంబంధిత సమస్య అధికం కావడంతో ఐసీయూలోకి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు మంగళవారం రాత్రి నిర్దారణ జరిగిందని చెప్పారు. అయ్యో.. నీళ్లనుకొని శానిటైజర్ తాగేశాడు
న్యూఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ మత ప్రార్థనలకు అతడు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. అంతకుముందు సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చినట్లుగా రికార్డులో ఉందని మంత్రి హిమంత బిస్వ వివరించారు. రాష్ట్రంలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ధుబ్రిలో గత రాత్రి అధిక కోవిడ్ పాజిటివ్ కేసులు తేలాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos