తొలి యాంకర్ రహిత ఛానల్ గా 'జీ హిందుస్తాన్' - రీ లాంచ్ సందర్భంగా రాజ్యసభ ఎంపి డా.సుభాష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

సమాజ శ్రేయస్సు కోరుకొని ఓ సరికొత్త ఆలోచనతో సొంత వ్యూస్ లేకుండా ..జనాలకు పనికొచ్చే న్యూస్ మాత్రమే కనిపించే ఛానల్ గా  జీ హిందుస్తాన్ మీ ముందుకు వస్తోంది  

Last Updated : Dec 13, 2018, 08:39 PM IST
తొలి యాంకర్ రహిత ఛానల్ గా 'జీ హిందుస్తాన్' - రీ లాంచ్ సందర్భంగా రాజ్యసభ ఎంపి డా.సుభాష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

'జీ హిందుస్తాన్'  రీ లాంచ్ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుభాష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలి యంకర్ రహిత న్యూస్ ఛానల్ గా జీ హిందుస్తాన్ ఛానల్ గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా యాంకర్ లేకుండానే ఈ ఛానల్ ను ప్రయోగాత్మకంగా జనాల ముందుకు తీసుకురాడం పట్ల సుభాష్ చంద్ర హర్షం వ్యక్తం చేశారు

సొంత వ్యూస్ కాదు..న్యూస్ మాత్రమే 
ఈ సందర్భంగా జర్నలిజం విలువల గురించి సుభాష్ చంద్ర ప్రస్తావిస్తూ దేశ ప్రజలు రియల్ న్యూస్ ను కోరుకుంటున్నారే తప్పితే .. సొంత వ్యూస్ ను కాదన్నారు. ఇలాంటి తరుణంలో సమాజ శ్రేయస్సు కోరుకొనే ఒక సరికొత్త ఆలోచన ఎందుకు చేయకూడదు..ఆ కొత్త ఆలోచనలో సొంత వ్యూస్ లేని జనాలకు పనికొచ్చే న్యూస్ మాత్రమే అందులో కనిపించాలని అభిప్రాయడ్డారు. ఇలాంటి ఆలోచనతోనే జీ హిందుస్తాన్ ఛానల్ ను తిరిగి రూపకల్పన చేసి యాంకర్ లేకుండా న్యూస్ ప్రసారం చేసే ఛానల్ గా తీర్చిదిద్దటం నిజంగా గర్వించదగ్గ విషమని సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

 

మీడియా రంగంలో సరికొత్త ఒరవడి 
'జీ హిందుస్తాన్' ఛానల్ రీ లాంచ్ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ జీ గ్రూప్ లో మొత్తం 13 ఛానళ్లు ఉన్నాయని..ఇందులో అనేక ఛానల్స్ అనేక భాషల్లో ప్రసారమౌతున్నాయని పేర్కొన్నారు. జీ గ్రూప్ లో భాగమైన జీ హిందుస్తాన్ ఛానల్ మళ్లీ పున: ప్రారంభమవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశరు. ప్రజా ఆంకాంక్షలకు అద్దంపట్టే జీ హిందుస్తాన్ ఛానల్ సమాచార ప్రపంచంలో సరికొత్త ఒరవడి తీసుకురావాలని ఈ సందర్భంగా సుభాష్ చంద్ర ఆంకాక్షించారు. 

వన్ నేషన్ - వన్ న్యూస్ గా గుర్తింపు
మన భారతావని విభిన్న జాతుల కలయిక. భిన్నసంస్కృతులకు నిలయం.  భిన్నత్వంలో ఏకత్వం కలిపించే ఈ దేశ ప్రజల వాయిస్ ను  జీ హిందుస్తాన్ ఛానల్ వినిపించాలని ఈ సందర్భంగా సుభాష్ చంద్ర ఆకాంక్షించారు.  ఇది  ' వన్ నేషన్ - వన్ న్యూస్ '  తరహాలో గుర్తింపు పొందాలని  పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ ఛానల్ ఇలాంటి నినాదంతో పనిచేసి యావత్ భారతావనిని ఏకతాటిపై తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలని  డాక్టర్ సుభాష్ చంద్ర సూచించారు.

Trending News