Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి

Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2023, 08:07 PM IST
Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి

Odisha Train Accident: ఒడిషాలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలాసోర్ దుర్ఘటనలో 275 మంది దుర్మరణం పాలైన విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా జాజ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మరో దుర్ఘటన జరిగింది. గూడ్స్ రైలు కింద పడుకున్న 9 మంది కూలీలలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అసలు గూడ్స్ రైలు కింద పడుకోవడం ఏంటి... ప్రమాదం ఎలా జరిగింది
గత కొద్ది రోజులుగా జాజ్‌పూర్ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజన్ లేకుండా పట్టాలపై నిలిపి ఉంది. కాగా అక్కడి పరిసరాల్లో కూలీ పనులు చేసుకుంటున్న కొంతమంది బుధవారం ఈ రైలు కింద విశ్రాంతి తీసుకుంటుండగా.. ఉన్నట్టుండి ఇంజన్ లేకుండానే గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు అందరూ గాఢ నిద్రలో ఉండటంతో.. ఈ ఊహించని ఈ ప్రమాదం బారి నుంచి వారికి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది అని తెలుస్తోంది. అలిసిపోయి సేద తీరుతున్న కూలీలు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు వదిలిన ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. 

మృతదేహాలను గుర్తించడానికి వీలు లేని పరిస్థితి..

ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలు చిద్రమైనందున.. వారిని ఇంకా గుర్తించేందుకు సైతం వీలు కలగలేదని సమాచారం అందుతోంది. భారీ ఈదురుగాలుల కారణంగానే నిలిపి ఉన్న గూడ్స్ రైలు ముందుకు కదిలినట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News