Omicron scare: దేశంలో ఒమిక్రాన్ కలవరం- రాజస్థాన్​లో ఓ వ్యక్తి మృతి!

Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్​ వేరియంట్​ ఆందోళనలు కలిగిస్తోంది. రాజస్థాన్​లో ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 03:25 PM IST
  • రాజస్థాన్​లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి​ మృతి
  • తొలి మరణంపై నెలకొన్న సందిగ్దత
  • దేశంలో పెరుగుతున్న కొవిడ్ ఆందోళనలు
  • థార్డ్​ వేవ్​ భయాలు పెంచుతున్న కేసుల వృద్ధి
Omicron scare: దేశంలో ఒమిక్రాన్ కలవరం- రాజస్థాన్​లో ఓ వ్యక్తి మృతి!

Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 309 ఒమిక్రాన్ (Omicron new cases)​ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 1,270కి చేరినట్లు వైద్య, ఆరోగ్య విభాగం (Omicron tatal cases in India) వెల్లడించింది.

రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 25 ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలగా.. ఆ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య విభాగం (Omicron Positive Man died in Rajasthan) వెల్లడించింది. కరోనా సోకకన్నా ముందు నుంచే ఆ వ్యక్తికి బీపీ, షుగర్​ వ్యాధులు కూడా ఉన్నట్లు తెలిపింది.

నిజానికి ఈ నెల 21న  ఆ వ్యక్తికి కొవిడ్ నెగెటివ్​గా తేలగా.. డిసెంబర్ 25న చేసిన పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్​గా గుర్తించారు వైద్యులు. అయితే నిమోనియా సోకడం కారణంగానే ఆ వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.

ఒమిక్రాన్ కారణంగా ఇదే తొలి మరణమా లేదా రెండోదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన 52 ఏళ్ల వ్యక్తి ఇటీవల.. గుండె పోటుతో మరణించాడు. అయితే అతడి మరణానికి కరోనా కారణం కాదని మహారాష్ట్ర వైద్యులు చెబుతున్నారు. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి మృతి చెంది ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్​ తొలి మరణంపై సందిగ్ధత నెలకొంది.

దేశంలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వతా ఈ స్థాయిలో కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు కూడా మళ్లీ 91 వేలు దాటాయి. ఈ పరిస్థితులన్నీ కొవిడ్ థార్డ్ వేవ్ రావచ్చన్న అంచనాలకు బలాన్నిస్తున్నాయి.

Also read: Born on Same Day: ఆ ఊర్లో జనవరి 1వ తేదీన 80 శాతం మంది పుట్టారంట.. అదెక్కడో తెలుసా?

Also read: Pondicherry Night curfew : పాండిచ్చేరిలో అదొక్క రోజు తప్ప జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News