Overnight millionaire: ఉదయం రూ.270తో లాటరీ కొన్నాడు- మధ్యాహ్నం కోటీశ్వరుడయ్యాడు!

Overnight millionaire: పశ్చిమ్​ బెంగాల్​లో అంబులెన్స్ డ్రైవర్​ను అదృష్టం వరించింది. రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. రూ.కోటి తగిలింది. దీనితో రాత్రికి రాత్రే ఆ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 05:27 PM IST
  • పశ్చిమ్​ బెంగాల్​లో జాక్​పాట్ కొట్టిన అంబులెన్స్ డ్రైవర్​
  • లాటరీలో కోటి రూపాయలు గెలుపు
  • లాటరీ టికెట్ ధర రూ.270 మాత్రమే
Overnight millionaire: ఉదయం రూ.270తో లాటరీ కొన్నాడు- మధ్యాహ్నం కోటీశ్వరుడయ్యాడు!

 Ambulance driver become millionaire: కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరు కల కనడం సాధారణం. అయితే అంత సులువుగా అందరూ కోటీశ్వరులు కాలేరు. అప్పుడప్పుడు కొంత మందికి అదృష్టం వరించడం వల్ల రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అవతుంటారు.

'కౌన్​ బనేగా కరోడ్​పతి' వంటి కార్యక్రమాల్లో విజేతలే ఇందుకు ఉదాహరణ. మరికొంత మంది లాటరీల ద్వారా భారీగా డబ్బు గెలుచుకుంటుంటారు. అయితే అందరిని ఈ అదృష్టం వరించదు.. నూటికో.. కోటికో ఒక్కరికి మాత్రమే అలా (Jackpot lottery) జరుగుతుంది.

అచ్చం అలాంటిదే పశ్చిమ్​ బెంగాల్​కు చెందిన అంబులెన్స్ డ్రైవర్​ షెక్ హిరా (Sheikh Heera) కథ కూడా.

రూ.270తో కోటి గెలిచాడు..

తూర్పు బర్దమాన్​ జిల్లాకు చెందిన షేక్​ హిరా అంబులెన్స్ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ రోజు ఉదయం రూ.270 పెట్టి కోటి రూపాయల (lottery prize) విలువ చేసే లాటరీ టికెట్​కు కొనుగోలు చేశాడు. అయితే మధ్యాహ్నం వరకు అతని టికెట్​ కోటి రూపాయలు (Ambulance driver Became Overnight crorepati) గెలిచింది. దీనితో ఆ వ్యక్తి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.

పోలీసులతో వెళ్లి డబ్బు తెచ్చుకుని..

లాటరీ డబ్బును తీసుకు వచ్చే సమయంలో ఎవరైనా కొట్టేస్తారేమోనని భయపడి.. పోలీసుల సహాయం తీసుకున్నాడు (West Bengal lottery winner) షేక్ హిరా. పోలీసులు డబ్బుతో పాటు అతనిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.

అమ్మకు మెరిగైన వైద్యం ఇప్పిస్తా..

లాటరీ డబ్బును ఏం చేస్తావని హిరాను అడగ్గా.. కొంత కాలంగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని.. వైద్యం చేయించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు లాటరీ డబ్బుతో ముందుగా తన తల్లికి మంచి ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేయిస్తానని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మంచి ఇల్లు నిర్మించుకుంటానని చెప్పాడు. ప్రస్తుతానికి ఇంతకన్నా వేరే ఆలోచనలు ఏం లేవని స్పష్టం చేశాడు.

Also read: ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్, అనుమానాస్పద ట్వీట్

Also read: Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News