ఏనుగులకు పిక్నిక్.. బాడీ, హెడ్ మసాజ్‌తో ఆటాపాట!

Last Updated : Aug 4, 2018, 07:22 PM IST
ఏనుగులకు పిక్నిక్.. బాడీ, హెడ్ మసాజ్‌తో ఆటాపాట!

జంతువులైనా ప్రాణులే కదా.. వాటికి మాత్రం కుటుంబం ఉండదా ? అవి మాత్రం సరదాలు కోరుకోవా అనే భావనతో ఏనుగుల కోసం వారం రోజలపాటు పిక్నిక్ ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్ లోని కన్హ నేషనల్ పార్క్ అధికారులు. ప్రతీ సంవత్సరం ఇలా ఇక్కడున్న ఏనుగుల కోసం వారం రోజులపాటు పిక్నిక్ ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏనుగులకు సరదాగా పిక్నిక్ మాత్రమే కాదండోయ్... వాటికి బాడీ మసాజ్, హెడ్ మసాజ్ కూడా చేసి ఏనుగులను రంజింప చేస్తున్నారు. ఇదిగో ఆ వారం రోజుల పిక్నిక్ పండగలో భాగంగా చివరి రోజున ఏనుగులు ఎంజాయ్ చేస్తోన్న దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 

 

పిక్నిక్ అంటే మంచి ఆహారం కూడా ఉండాలి కనుక వాటికి కొబ్బరి చిప్పలు, అరటి పండ్లు లాంటి నచ్చిన ఫలాను ఆహారంగా పెట్టి ఏనుగులకు ఎంటర్ టైన్ మెంట్ అందించారు కన్హ నేషనల్ పార్క్ అధికారులు.

Trending News