PM Modi review meeting on COVID-19: ఫోర్త్‌వేవ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi COVID review with CMs: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ .. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణకు పలు సూచనలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 04:56 PM IST
  • కొవిడ్‌పై ప్రధాని మోడీ రివ్యూ
    రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
    అప్రమత్తంగా ఉండాలని సూచన
PM Modi review meeting on COVID-19: ఫోర్త్‌వేవ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi COVID review with CMs: చిన్నపిల్లల కోవిడ్ వాక్సినేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని మోడీ. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఫోర్త్ వేవ్, హాస్పిటళ్లలో మౌళిక సదుపాయాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో  హోంమంత్రి అమిత్ షాతో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, చత్తీస్ గఢ్ సీఎం భూపేష్‌ బఘల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

కొవిడ్ సంక్షోభాన్ని ఇతరదేశాలతో పోల్చితే సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు ప్రధాని మోడీ. అయితే మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ సంక్షోభం పూర్తిగా తొలగిపోలేదన్నారు. వాక్సిన్ల విషయంలో ప్రపంచదేశాలతో పోల్చితే మనం చాలా ముందంజలో ఉన్నామన్నారు మోడీ. దేశంలో 96 శాతం మంది వయోజనలులు ఫస్ట్ డోస్ టీకా తీసుకున్నారన్నారు. ఇది దేశానికే గర్వకారణమన్నారు. అర్హులైన వారిలో 85 శాతంమంది రెండో డోస్ టీకా తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. 

ఫోర్త్ వేవ్ అప్రమత్తతపై అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు ప్రధాని మోడీ. హాస్పిటళ్లలో మౌళిక సదుపాయాలు మరింత పెంచుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ పై తనిఖీలు నిర్వహించాన్నారు. ప్రజలకు కొవిడ్ నిబంధనలపై సరైన అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా కొవిడ్ నియంత్రణకు కలిసి పనిచేయాలన్నారు మోడీ. 

కొంతకాలంగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ముగిసాక వెయ్యి దిగువకు పడిపోయిన డెయిలీ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ప్రతిరోజూ వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పాటిటివిటీ రేట్ కూడా ఆరు శాతానికి పెరిగింది. మిగితా రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదంతా ఫోర్త్ వేవ్‌కు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Also read: Covaxin for Kids: 6 నుండి 12 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్‌కి DCGI అనుమతి

Also read: Whatsapp Tricks: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా.. ఈ ట్రిక్‌తో మీకు మీరే ఇలా అన్‌బ్లాక్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News