కండకావరం.. ఖా'కీచకం'.. .

పోలీసులకు.. చేతిలో చట్టం. . గుప్పిట్లో అధికారం. . ఉన్నది ప్రజలను రక్షించడానికి. కానీ ఓ పోలీసు అధికారి చేసిన పని చూస్తే ..  ఛీ.. ఛీ అనకుండా మానరు. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని  గంధ్వాని పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. 

Last Updated : Feb 12, 2020, 10:51 AM IST
కండకావరం.. ఖా'కీచకం'.. .

పోలీసులకు.. చేతిలో చట్టం. . గుప్పిట్లో అధికారం. . ఉన్నది ప్రజలను రక్షించడానికి. కానీ ఓ పోలీసు అధికారి చేసిన పని చూస్తే ..  ఛీ.. ఛీ అనకుండా మానరు. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని  గంధ్వాని పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది.  

సాక్షాత్తూ ఆ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి అతడు. పేరు నరేంద్ర సూర్యవంశి. మధ్యప్రదేశ్ లోని గంధ్వాని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జిగా విధులు వెలగబెడుతున్నాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కానీ అదే ఊరిలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్య ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఐతే నరేంద్ర  సూర్యవంశి .. దీనిపై తీవ్రంగా ఆగ్రహించాడు. నేను భర్తను.. అందులో పోలీసు వాడిని .. నన్నే ప్రశ్నిస్తావా అంటూ రోజూ హింసించడం మొదలు పెట్టాడు. చాలా రోజులు భరించిన తర్వాత ఆ ఇల్లాలు .. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే భర్తను నిలదీసింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన నరేంద్ర సూర్యవంశి. . .  ఆమెను పోలీస్ స్టేషన్ ఎదుటే ఈడ్చి పడేశాడు. విచక్షణారహితంగా చితకబాదాడు. చివరకు బూటు తీసి కొట్టడం ప్రారంభించాడు. ఐతే అక్కడే ఉన్న పోలీసులు .. అతన్ని నిలువరించారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  భార్యపై చేయి చేసుకున్న నరేంద్రను అదుపులోకి తీసుకుని శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారులకు రిపోర్టు చేయాలని నరేంద్రను ఆదేశించినట్లు గంధ్వానీ పోలీసులు తెలిపారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Trending News