Rajinikanth: మెరుగ్గానే తలైవా ఆరోగ్యం.. డిశ్చార్జ్‌పై నేడు నిర్ణయం

సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై (Rajinikanth health conidtion) అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.

Last Updated : Dec 27, 2020, 03:10 PM IST
Rajinikanth: మెరుగ్గానే తలైవా ఆరోగ్యం.. డిశ్చార్జ్‌పై నేడు నిర్ణయం

Rajinikanth's health updates: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై (Rajinikanth health conidtion) అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ర‌జ‌నీకాంత్‌కు నిన్న అన్ని వైద్య ప‌రీక్ష‌ల చేశామని రిపోర్ట్‌లన్నీ నార్మ‌ల్‌గానే ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిల‌క‌డగానే ఉందని.. అయితే ఈ రోజు ఆయన డిశ్చార్జ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామని అపోలో వైద్యులు వెల్లడించారు. 

అయితే హై బీపీతో శుక్ర‌వారం నాడు ర‌జ‌నీకాంత్ (Rajinikanth) అపోలో ఆసుప‌త్రిలో చేరారు. ముందుగా రజనీకాంత్‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఆ త‌ర్వాత బీపీకి సంబంధించి వైద్యం అందించారు. నిన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని (health health bulletin) వైద్యులు ప్రకటించారు. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని (Rajinikanth hospitalised) నిపుణులైన వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరినప్పటినుంచి ఆయన అభిమానులు ఆయన క్షేమంగా డిశ్చార్జ్ కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

ప్రస్తుతం అన్నత్తే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న రజనీకాంత్.. డిసెంబరు 31న తన పార్టీ, గుర్తులను ప్రకటిస్తానని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో జరిగే తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ఇటీవల రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని ఐదుగురి మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News