నోట్ల ముద్రణలో వేగం పెంచాం : సుభాష్ చంద్ర గర్గ్

నోట్ల కొరతను ఎదుర్కునే విధంగా ఆర్బీఐ నోట్ల ముద్రణలో వేగం పెంచిందని ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సుభాష్‌ చంద్ర గర్గ్‌ తెలిపారు.

Last Updated : May 6, 2018, 07:05 PM IST
నోట్ల ముద్రణలో వేగం పెంచాం : సుభాష్ చంద్ర గర్గ్

నోట్ల కొరతను ఎదుర్కునే విధంగా ఆర్బీఐ నోట్ల ముద్రణలో వేగం పెంచిందని ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సుభాష్‌ చంద్ర గర్గ్‌ తెలిపారు. పెరుగుతున్న అదనపు అవసరాలను అందుకునే విధంగా రూ.500,రూ.200, రూ.100 నోట్లను అధిక శాతంలో ముద్రిస్తున్నామని గర్గ్ పేర్కొన్నారు. నిత్యం సుమారుగా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల విలువైన రూ.500 నోట్లను ముద్రిస్తున్నట్టు సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టంచేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుభాష్ చంద్ర గర్గ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొ్న్న నగదు కొరతను కొంతమేరకు అధిగమించగలిగాం. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 85శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులో వుంది. ఇంకా అవసరమైన నగదు డిమాండ్‌ను అందుకునే లక్ష్యంలో భాగంగా నోట్ల ముద్రణలో మరింత వేగాన్ని పెంచడం జరిగింది" అని చెప్పారు. 

ప్రస్తుతం రూ. 7 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణీలో ఉన్నాయి. అందుకే ప్రస్తుతానికి రూ.2000 నోట్లను ముద్రించడం లేదు. అయితే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తోంది మాత్రం రూ.500, రూ.200, రూ.100 నోట్లనే. అన్నింటికన్నా ఎక్కువగా రూ.500 నోట్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంది. అందుకే ఆ డిమాండ్‌ని అందుకునేందుకు వీలుగా నిత్యం సుమారు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లను ముద్రించడం జరుగుతోంది అని గర్గ్ పీటీఐకి తెలిపారు. 

Trending News