Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై సెల్యూట్‌ చేస్తోన్న ఈమె ఎవరో తెలుసా?

India's first woman Rafale pilot Shivangi Singh: ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై కనిపించిన శివంగి సింగ్‌ రికార్డ్స్‌ బద్దలు కొట్టిన పైలట్‌.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 03:34 PM IST
  • ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌
  • రాజ్‌పథ్ మార్గంలో కొనసాగిన పరేడ్‌
  • ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై రఫేల్‌ ఫ్లైట్‌ను నడిపిన తొలి మహిళా పైలట్‌
Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై సెల్యూట్‌ చేస్తోన్న ఈమె ఎవరో తెలుసా?

India's first woman Rafale jet pilot : దేశం మొత్తం ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 

వేడుకల్లో భాగంగా రాజ్‌పథ్ మార్గంలో కొనసాగిన పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. దేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచే శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. పరేడ్‌లో భాగంగా భారత వాయుసేన శకటాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తు కోసం భారత వాయుసేన కొత్త రూపు అనే బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ శకటంపై వాయుసేన రఫేల్‌ ఫ్లైట్‌ను నడిపిన తొలి మహిళా పైలట్‌ (India's first woman Rafale pilot) కనిపించడం విశేషం. 

ఇక దేశంలో రఫేల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందింది శివంగి సింగ్‌. (Shivangi Singh) ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై ఆమె సెల్యూట్‌ చేస్తూ కనిపించింది. ఇక ఎయిర్‌‌ ఫోర్స్‌ శకట ప్రదర్శనలో పాల్గొన్న రెండో మహిళా పైలట్‌గా కూడా ఈమె ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి శకటంపై (Air Force Tableau) నిల్చుని జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని సెల్యూట్ చేస్తూ కనిపించింది. అలా ఈ  రిపబ్లిక్‌ డేన (Republic Day) సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది శివంగి సింగ్.

Also Read : Arvind On CM KCR: 'పాస్​పోర్టులు అమ్ముకున్న దొంగ' అంటూ సీఎం కేసీఆర్​పై విమర్శలు..!

గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్‌ భావన కాంత్‌ ఎయిర్‌‌ ఫోర్స్‌ శకటంపై కనిపించిన తొలి మహిళగా ఘనత దక్కించుకున్నారు. ఇక వారణాసికి చెందిన శివంగి సింగ్‌ 2017లో ఎయిర్‌‌ ఫోర్స్‌లో మహిళా పైలట్‌గా చేరింది. రఫేల్‌ కంటే ముందు మిగ్‌-21 బైసన్‌ విమానాన్ని శివంగి సింగ్‌ నడిపారు. అలాగే రఫేల్‌ (Rafale) జెట్ ఫ్లైట్స్‌ భారత్‌కు చేరుకున్న తొలిరోజుల్లోనే శివంగి సింగ్‌ ఫ్లైట్ లెప్టినెంట్‌గా జాయిన్ అయ్యారు. ఇక శివంగి సింగ్ వైమానిక దళంలో చేరాలనే లక్ష్యంతో 2016లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. చదువుతోన్న సమయంలో ఆమె ఎన్సీసీ యూపీ ఎయిర్ స్క్వాడ్రన్‌లో పని చేశారు.

Also Read : UNSC: ఐరాస వేదికగా పాక్‌ దారుణ రికార్డును బయటపెట్టిన భారత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News