Rs 2,000 notes printing: రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేశారా ? స్పందించిన కేంద్రం

కేంద్రం రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉందని... అందుకే రూ.2,000 ప్రింటింగ్ (Rs 2,000 notes printing) ఆపేశారని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రూ.2000 నోట్లను ముద్రించడం ఆపేశారని.. అంతేకాకుండా ఏటీఎంలలో 2 వేల నోట్లను పెట్టరాదని బ్యాంకులకు సైతం ఆదేశాలు అందాయనేది ఆ ప్రచారం సారాంశం.

Last Updated : Mar 16, 2020, 07:49 PM IST
Rs 2,000 notes printing: రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేశారా ? స్పందించిన కేంద్రం

న్యూ ఢిల్లీ: కేంద్రం రూ.2,000 నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉందని... అందుకే రూ.2,000 ప్రింటింగ్ (Rs 2,000 notes printing) ఆపేశారని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రూ.2000 నోట్లను ముద్రించడం ఆపేశారని.. అంతేకాకుండా ఏటీఎంలలో 2 వేల నోట్లను పెట్టరాదని బ్యాంకులకు సైతం ఆదేశాలు అందాయనేది ఆ ప్రచారం సారాంశం. ఇదే విషయమై కేంద్రం స్పందిస్తూ.. 2వేల నోట్ల ముద్రణను ఆపేయాలని నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది. 2వేల నోట్ల ముద్రణ ఆపేశారా అనే ప్రశ్నకు సోమవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన లోక్ సభకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News