ఆశారాం బాపు, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఒకే జైలు పక్షులు

1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

Last Updated : Apr 5, 2018, 09:37 PM IST
ఆశారాం బాపు, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఒకే జైలు పక్షులు

1998 నాటి కృష్ణ జింకల వేట కేసులో రాజస్థాన్ లోని జోధ్ పూర్ కోర్టు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం రాజస్థాన్ పోలీసులు సల్మాన్ ఖాన్ ని జోధ్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈరోజు రాత్రికి సల్మాన్ ఖాన్ అక్కడే గడపాల్సి వుంటుంది. సల్మాన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ అతడి తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జోధ్ పూర్ కోర్టు రేపు శుక్రవారం విచారణ జరపనుంది. జోధ్ పూర్ సెంట్రల్ జైలులో 2వ బ్యారక్ లో సల్మాన్ ఖాన్ ఖైదీగా వుండాల్సి వుండగా యాదృశ్చికంగా లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసుల్లో ఖైదీగా జైలు శిక్ష ఎదుర్కుంటున్న ఆశారాం బాపు కూడా అదే బ్యారక్ లో వుండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు వేర్వేరు కేసుల్లో జైలుపాలైన ఈ ఇద్దరు కలిసి ఒకే బ్యారక్ లో వుండనున్నారు. 

2013లో తన ఆశ్రమంలోనే ఓ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో జైలుకి వెళ్లిన ఆశారాం బాపు గత ఐదేళ్లుగా ఇదే బ్యారక్ లో జైలు శిక్ష ఎదుర్కుంటున్నాడు. 

Trending News