సరికొత్త శాంసంగ్ ఫోన్ ; ఫీచర్స్ తో పాటు ధర అదుర్స్

Last Updated : Dec 5, 2017, 12:43 PM IST
 సరికొత్త శాంసంగ్ ఫోన్ ; ఫీచర్స్ తో పాటు ధర అదుర్స్

శాంసంగ్ సంస్థ అతి త్వరలోనే మరో కొత్త మోడల్ ఫోన్ ను పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ‘డబ్ల్యూ 2018’ పేరుతో రానున్న ఇది మడతపెట్టుకునే మోడల్ ( ప్లిప్ ఫోన్ ) లో ఉండనుంది.  గతంలో ఇటువంటి ప్లిప్‌ఫోన్లు చాలానే మార్కెట్లోకి వచ్చినా ఇప్పుడు రానున్న ఫోన్ మాత్రం వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయంలోనూ దీనికి మరేదీ సాటి రాదని శాంసంగ్ చెబుతోంది..రెండు డిస్‌ప్లేలు ఈ ఫోన్ ప్రత్యేకత. పైన ఒకటి, లోపల మరోటి ఉంటాయి. శాంసంగ్ ఇటీవల వరుసగా విడుదల చేస్తున్న ‘గెలాక్సీ’ సిరీస్‌కు భిన్నంగా విడుదల చేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం గమనార్హం.  అయితే ధర కూడా అదే రితో ఉండనుంది. ‘డబ్ల్యూ 2018’ ధర భారత్‌లో రూ.1.50 లక్షల వరకు ఉండే అవకాశముందని కంపెనీ ప్రతినిధుల నుంచి సమాచారం...

 ‘డబ్ల్యూ 2018’  ఫీచర్స్ ఇవే  : 

* 2 డిస్‌ప్లేలు ఈ ఫోన్ ప్రత్యేకత
*బిక్స్ బై వాయిస్ అసిస్టెంట్
* 6జీబీ ర్యామ్
* 64 జీబీ/256 జీబీ స్టోరేజ్‌ 
* యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
* కామ్‌షెల్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్
* ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఓఎస్
* 2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 
* 835 స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌
* 12 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 

 

Trending News