Rafale Fighter Jets: సర్వమత ప్రార్థనలతో.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్

రఫేల్ ఫైటర్ జెట్స్.. భారత వైమానిక దళంలోకి చేరాయి. గురువారం అంబాలా ఐఏఎఫ్ ఏయిర్‌బేస్‌లో ఐదు రఫేల్ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ కార్యక్రమంలో అట్టహాసంగా జ‌రిగింది.

Last Updated : Sep 10, 2020, 12:34 PM IST
Rafale Fighter Jets: సర్వమత ప్రార్థనలతో.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్

Rafale induction ceremony at IAF airbase in Ambala: న్యూఢిల్లీ‌: రఫేల్ ఫైటర్ జెట్స్.. భారత వైమానిక దళంలోకి చేరాయి. గురువారం అంబాలా ఐఏఎఫ్ ఏయిర్‌బేస్‌లో ఐదు రఫేల్ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ కార్యక్రమంలో అట్టహాసంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లి ( Florence Parly ), డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి డా అజయ్ కుమార్, తదితరులు హాజరయ్యారు. రఫేల్ యుద్ధవిమానాలను జాతికి అంకితం చేసేముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

Rafale induction ceremony, 

అన్నీ మతాలకు చెందిన పెద్దలు రఫెల్ యుద్ధ విమానాలకు ప్రార్థనలు చేసిన అనంతరం ఏయిర్ షో నిర్వహించారు. ముందుగా రాఫేల్ విమానాలకు సుఖోయ్‌-30, జాగ్వార్, తేజస్ విమానాలు గాలిలో ఎగురుతూ వంద‌నం చేసి స్వాగతం పలికాయి. ఈ అద్భుతమైన కార్యక్రమానికి హర్యానాలోని అంబాల ఏయిర్ బేస్ వేదికైంది. అయితే.. భారత్, చైనా ఉద్రికత్తల మధ్య రపేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి చేరడంతో.. దేశ వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. 

'Sarva Dharma Puja' conducted at the Rafale induction ceremony,

ఇదిలాఉంటే.. 36 రాఫెల్స్ కోసం ఐదేళ్ల క్రితం 59వేల కోట్ల ఒప్పందం జరిగింది. అయితే.. జూలైలో ముందుగా ఐదు రఫేల్స్ యుద్ధ వివానాలు భారత్‌కు వచ్చాయి.  

Trending News