గొలుసులతో కట్టారు.. కొట్టారు.. ఈడ్చుకెళ్లారు.. .

పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.  అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్తలు, నాయకులు గూండాగిరీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ ఉపాధ్యాయురాలిపై కీచక పర్వానికి తెరతీసిన ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్ పూర్ జిల్లాలోని గంగ్రామ్ పూర్ లో జరిగింది. 

Last Updated : Feb 3, 2020, 10:30 AM IST
గొలుసులతో కట్టారు.. కొట్టారు.. ఈడ్చుకెళ్లారు.. .

పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి.  అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్తలు, నాయకులు గూండాగిరీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఓ ఉపాధ్యాయురాలిపై కీచక పర్వానికి తెరతీసిన ఘటన పశ్చిమ బెంగాల్ దినాజ్ పూర్ జిల్లాలోని గంగ్రామ్ పూర్ లో జరిగింది.  

అధికార మదం తలెకెక్కిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అమల్ సర్కార్ చేసిన పని ఇది. ఓ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై తన ప్రతాపం చూపించాడు.  ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటీ అంటే తన భూమిలో నుంచి రోడ్డు వేసేందుకు  ససేమిరా అనడమే.  ప్రభుత్వ కార్యక్రమానికే అడ్డు వస్తావా .. అంటూ ఆమెపై తృణమూల్ నాయకుడు అమల్ సర్కార్ దాష్టీకం ప్రదర్శించాడు.  నడి రోడ్డుపై విపరీతంగా చితకబాదాడు. అంతటితో ఆగకుండా . . గొలుసులతో కట్టేసి ఈడ్చుకెళ్లారు. రోడ్డు నిర్మాణం కోసం భూమి ఇస్తావా ఛస్తావా అంటూ బెదిరించాడు. 

నడి రోడ్డుపై ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనం పాటించారు. ఉపాధ్యాయురాలిని కాపాడేందుకు పోలీసులు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో స్థానికంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  అధికార పార్టీ నాయకుల ఆగడాలను ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ను మరో బీహార్ లా మార్చుతున్నారని విపక్ష పార్టీలు మమతా సర్కారును నిందిస్తున్నాయి. 

Trending News