భారత్‌లో రెండో కరోనా కేసు నమోదు

చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ . .  క్రమంగా వివిధ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉంటుందోనని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ ..  చాప కింద నీరులా  విస్తరిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

Last Updated : Feb 2, 2020, 10:31 AM IST
భారత్‌లో రెండో  కరోనా కేసు నమోదు

చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ . .  క్రమంగా వివిధ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉంటుందోనని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ ..  చాప కింద నీరులా  విస్తరిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే భారత్‌లోని కేరళలో కరోనా వైరస్ కేసు నమోదైంది. తాజాగా కేరళలోనే మరో కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

వుహాన్ లో చదువుకుంటూ కరోనా వైరస్ దెబ్బకు భయపడి ఓ విద్యార్థిని కేరళకు తిరిగి వచ్చింది. ఆమెకు జలుబు, దగ్గు రావడంతో కరోనా వైరస్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ సొంతంగానే ఆస్పత్రికి వెళ్లింది. ఆమె ఊహించిందే నిజమైంది. ఆమె రక్త నమూనాలు పుణేకు పంపించగా .. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఐతే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు తాజాగా మరో వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రెండో కేసు నమోదు కావడంతో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

Trending News