Shiv Seva attacked Narendra Modi,BJP : సైనికులు అమరులవుతుంటే చోద్యం చూస్తున్నారా..?

కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై  సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది.

Last Updated : Jan 3, 2020, 09:33 AM IST
Shiv Seva attacked Narendra Modi,BJP : సైనికులు అమరులవుతుంటే చోద్యం చూస్తున్నారా..?

కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై  సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది. జమ్మూ కాశ్మీర్ లో .. పాకిస్తాన్ తరఫు నుంచి నిత్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందా అంటూ శివసేన సామ్నా పత్రిక ప్రశ్నించింది.  సరిహద్దులో భారత సైనికులు అమరులవుతుంటే .. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి అంతా సాధారణంగా ఉందని ప్రధాని నరేంద్ర  మోదీ, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నాయని  ఆరోపించింది. ఇది ముమ్మాటికీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించింది. 

మహారాష్ట్ర సంకీర్ణ  ప్రభుత్వానికి సంబంధం లేదు
జమ్మూ కాశ్మీర సరిహద్దుల్లో  గత నెలలో  8 మంది మహారాష్ట్ర సైనికులు అమరులయ్యారని సామ్నా తన కథనంలో పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వాన్నే నిందించాలని కానీ .. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొంది. కాశ్మీర్ సరిహద్దుల్లో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం అంతా బాగుందని ప్రచారం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతున్నారని తెలిపింది.

Trending News